లింగాసోల్ పరిచయం | మీ వ్యాపారాన్ని లింగిఫ్య్ చేయండి


లింగాసోల్ పరిచయం

లింగాసోల్ కంపెనీ అసాధారణమైన ఉత్పన్నం – కట్టింగ్-ఎడ్జ్ సాంకేతికత ఆధారంగా ఒకవైపు ఇది సృజనాత్మక స్థానికీకరణ ఉత్పత్తులను రూపొందిస్తుంది, మరోవైపు ఇది పూర్తి అనువాద సేవల రూపాలను అందిస్తుంది.

లింగిఫ్య్ ఉత్పత్తి స్టాక్ మరియు LinguaNext విలీనం ద్వారా అత్యంత ప్రత్యేక బృందం లింగాసోల్కి అందించబడుతుంది.

లింగాసోల్ పూర్తిగా వెలుపల అంతరాయం కలిగించని స్థానికీకరణ మధ్యస్థ ఉత్పత్తుల నమ్మకంతో కొనసాగుతుంది. అనువాద సేవల ద్వారా ఈ ఉత్పత్తులు పూర్తి చేయబడతాయి. సమిష్టి ప్రభావం అనేదే లింగిఫ్య్ – ఒకే స్థాన పరిష్కారం: పూర్తిగా వెలుపలి మరియు సంపూర్ణ నిర్వహిత పరిష్కారం కోసం సాంకేతికత.

మీ వ్యాపారాన్ని లింగిఫ్య్ చేయండి: వేగంగా, సులభంగా, సునాయాసంగా మీ వెబ్‌సైట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయండి, మీ అప్లికేషన్‌లను స్థానికీకరించండి లేదా మీ పత్రాలను అనువదించండి.

నిర్వాహణ బృందం

సునీల్ కుల్‌కర్ణి, CEO

Sunil Kulkarni సునీల్ కొత్త ఉత్పత్తులు మరియు మార్కెట్‌లను రూపొందించాలనే లక్ష్యం ఉన్న వ్యవస్థాపకులు. అతను స్థానికీకరణ అంతర్భాగం, FinTech & IoTపై దృష్టి సారించి, Fidel Technologies ను మధ్యస్థాయి సంస్థగా వృద్ధి చేయడానికి జపనీస్ & ఆసియా మార్కెట్‌లతో సన్నిహితంగా పని చేసారు, సునీల్ తను మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రత పొందిన జపనీస్ ద్విభాషి. సునీల్ 1997 నుండి టోక్యో బయటి నివసిస్తారు మరియు జపాన్ - భారతదేశ వ్యాపారం & టెక్నాలజీ కార్యక్రమాలను కలపడంలో చురుకుగా పాల్గొంటారు.

రాజీవ్‌లోచన్ ఫడ్కే, అధ్యక్షుడు & CTO

Rajeevlochan Phadke రాజీవ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ మరియు భాషా సాంకేతిక ఉత్పత్తుల రంగాల్లో 20 ఏళ్ల పైబడిన అనుభవంతో ప్రశంసలు అందుకుంటున్న భాషా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నారు. రాజీవ్ సాఫ్ట్‌వేర్ స్థానికీకరణలో సృజనాత్మక ఉత్పత్తులు మరియు సాంకేతికతలను రూపొందించడానికి 2002లో ఇమేజ్ పాయింట్ సంస్థను స్థాపించారు. అతని నాయకత్వంలో, ఇమేజ్ పాయింట్ భారతదేశంలో భాషా స్థానికీకరణ రంగంలో అత్యంత ప్రాధాన్య విక్రేతగా వెలుగొందింది. ఇమేజ్ పాయింట్ సంస్థ LinguaNextలో విలీనమైన తర్వాత, వారు LinguaNextలో సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించారు. కొత్త అవతార్‌లో, LinguaNext ఉత్పత్తులు ప్రముఖ కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ మరియు ERP సాఫ్ట్‌వేర్‌తో సహా అన్ని ప్రధాన వాణిజ్య సాఫ్ట్‌వేర్‌లకు ఆవశ్యక స్థానికీకరణ సాధనాలుగా అవతరించాయి. వారు LinguaNext కోసం SAP ఆమోదిత వ్యాపార ఉత్పత్తుల భాగస్వామ్యాన్ని స్వీకరించే ప్రక్రియకు బలమైన పునాది వేసారు - ఇది ఒక విశేషమైన భాగస్వామ్య హోదా మరియు ఇది ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఈ సంస్థకు దక్కింది. వారు చేసిన ఆవిష్కరణల్లో చాలా వాటికి ప్రత్యేక హక్కులు మంజూరు చేయబడ్డాయి. వారు ప్రస్తుతం వెబ్‌సైట్ అనువాదంలో అత్యంత ప్రామాణిక ఉత్పత్తులను ఆవిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు మరియు సత్వర స్థానిక భాష సౌలభ్యాన్ని అందించడం ద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రజల్లో బాగా చొచ్చుకుపోయేలా చేయడంలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నారు. ఇంతకుముందు, రాజీవ్ 9 ఏళ్ల పాటు C-DACలో పని చేసారు, అక్కడ ఐటి శిక్షణా రంగంలో C-DAC కార్యక్రమాల స్థాపనలో సహ భాగస్వామిగా ఉన్నారు. ఇంకా, వారు ఇ-గవర్నెన్స్‌లో అధిక పనితీరు గల కంప్యూటింగ్‌లో ప్రారంభ ప్రయత్నంగా C-DACని మొదలుపెట్టారు మరియు భారీ స్థాయిలో ఇ-గవర్నెన్స్‌ ప్రాజెక్ట్‌లను రూపొందించారు & నిర్వహించారు. రాజీవ్ IIT ముంబై నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.